Raghurama Krishna Raju: రెండు సమావేశాలకు రాకుంటే అనర్హత వేటే!
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:52 AM
వచ్చేనెలలో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాలకైనా జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని...
ఎథిక్స్ కమిటీ పరిశీలనలో వైసీపీ ఎమ్మెల్యేల తీరు: రఘురామ
డాబాగార్డెన్స్(విశాఖ సిటీ), జనవరి 18(ఆంధ్రజ్యోతి): వచ్చేనెలలో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాలకైనా జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా, జీతభత్యాలు తీసుకుంటున్న అంశాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు వరుసగా రెండు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడుతుందని చెప్పారు. శాసన మండలి, శాసనసభల్లో వేర్వేరు వాతావరణం నెలకొందన్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.