కస్టడీలో రఘురామను అడిగిన ప్రశ్నలేంటి?
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:16 AM
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చ ర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. ఆ
ఆయన ఏమి సమాధానాలిచ్చారు..?
విచారణలో ఐపీఎస్ సునీల్ నాయక్‌కు పోలీసుల ప్రశ్నలు
గుంటూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చ ర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. ఆరో రోజైన మంగళవారం పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. హైదరాబాదులో రఘురామను అరెస్టు చేసి గుంటూరు తీసుకొచ్చినప్పుడు ఆయనను ఎవరెవరు విచారించారు..? విచారణలో ఏమేమి ప్రశ్నలు అడిగారు..? దానికి ఆయన ఏమి బదులిచ్చారు..? అంటూ సునీల్ నాయక్‌ను ప్రశ్నించారు. సునీల్ నాయక్ నుంచి స్పష్టమైన సమాధానాలు రానట్లు తెలిసింది. ఆధారాలతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబాటు పడ్డారని తెలిసింది. అయినా ఆయన నుంచి ఇప్పటికే కీలక రాబట్టినట్లు తెలిసింది. ఆయన చెప్పిన సమాధానాలను, అధికారుల వద్ద ఉన్న ఆధారాలను బేరీజు వేసుకొని ఆరోజు ఏం జరిగింది.? అందులో ఎవరి పాత్ర ఏంటి..? అనే దానిపై అధికారులకు కొంత స్పష్టత వచ్చింది. సునీల్ నాయక్‌కు సంబంధించి దర్యాప్తు అధికారి దామోదర్ పక్కాగా నివేదిక సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ విచారణ అనంత రం కేసు దర్యాప్తు మరింత వేగవంతమవుతుందని భావిస్తున్నారు. నాయక్ విచారణ ముగిసిన తర్వాత దర్యాప్తు.. సునీల్ కుమార్, నాటి ఇంటిలిజెన్స్ చీఫ్ పి.సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్‌ల వైపు మరలే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 12 వరకు సునీల్ దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.