Share News

నేను పార్టీ పెట్టడం లేదు: రఘురామ

ABN , Publish Date - May 24 , 2026 | 05:03 AM

తాను ఏ విధమైన రాజకీయ పార్టీ ప్రారంభించడం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

నేను పార్టీ పెట్టడం లేదు: రఘురామ

కాళ్ల, మే 23(ఆంధ్రజ్యోతి): తాను ఏ విధమైన రాజకీయ పార్టీ ప్రారంభించడం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘నకిలీ ఎస్సీ అట్రాసిటీ కేసుల వల్ల నేను పడిన ఇబ్బందులు సామాన్యులు పడకూడదనే ఉద్దేశంతో సామాజిక దృక్పథంతో ఒకరిద్దరు లాయర్లతో ‘తెలుగు వీర లేవరా’ అనే సొసైటీని ప్రారంభించా. ఇది కేవలం న్యాయపరమైన ఇబ్బందులు పడే వారికి సలహాలు ఇవ్వడానికే. దీని ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ సేవలందిస్తాం. రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీనిని కొంత మంది పెడార్థాలుతీస్తూ రాజకీయ పార్టీగా వర్ణించడం సరైనది కాదు. టీడీపీలో నేను చాలా సంతోషంగా ఉన్నా. బాధ్యత గల చక్కటి పదవిలో ఉన్నా. ముఖ్యమంత్రితో, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో, అందరితోనూ నాకు చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. దీనిపై ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు’ అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Updated Date - May 24 , 2026 | 05:04 AM