Share News

ప్రశ్నిస్తే ఎమ్మెల్యేనూ బెదిరిస్తారా?: రఘురామ

ABN , Publish Date - May 16 , 2026 | 04:28 AM

ఒక మతం పేరు చెప్పి మరో మత విశ్వాసం ఉన్న ఎమ్మెల్యేను తుదముట్టిస్తాము.. మట్టిలో కలిపేస్తామని బెదిరిస్తారా..?

ప్రశ్నిస్తే ఎమ్మెల్యేనూ బెదిరిస్తారా?:  రఘురామ

కాళ్ళ, మే 15 (ఆంధ్రజ్యోతి): ఒక మతం పేరు చెప్పి మరో మత విశ్వాసం ఉన్న ఎమ్మెల్యేను తుదముట్టిస్తాము.. మట్టిలో కలిపేస్తామని బెదిరిస్తారా..? అని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మం డలం పెద అమిరంలోని క్యాం పు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గం విసన్నపేటకు చెందినకారే నవీన్‌బాబు సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లపై ఆయన స్పందిస్తూ.. మతం పేరు చెప్పుకొంటూ చేసిన కామెంట్లపై ప్రభుత్వం, పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు.

Updated Date - May 16 , 2026 | 04:29 AM