Share News

27 నుంచి రాఘవేంద్ర స్వామి 355వ సప్తరాత్రోత్సవాలు

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:24 PM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌లు కసరత్తు చేపట్టారు.

27 నుంచి రాఘవేంద్ర స్వామి 355వ సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయంలో ప్రభుత్వ అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు

విజయవంతంపై శ్రీమఠం అధికారుల సమీక్ష

మంత్రాలయం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌లు కసరత్తు చేపట్టారు. మంగళవారం మంత్రాలయంలోని టీటీడీ కల్యాణ మండపంలో శ్రీమఠం, ప్రభుత్వ అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై రాజాపీ అప్రమేయాచార్‌, కృష్ణాకౌసిక్‌, దివాన సుజయీంద్ర అచార్‌, వాజీంద్ర ఆచార్‌, గౌతమ్‌ ఆచార్‌, ఆనంద తీర్థ ఆచార్‌ ఆధ్వర్యంలో సమీక్షసమావేశం నిర్వహించారు. పరిశుభ్రత, తాగునీరు, వైద్యం, విద్యుత, పార్కింగ్‌, నదిస్నానం, విఐపీ ప్రోటోకాల్‌, రవాణ సౌకర్యాలు, క్యూలైన్లు, పరిమళ ప్రసాదం, అన్నదానం, వసతి, రోడ్లు, మరుగుదొడ్లు, పోలీసు భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల అదేశాలతో ప్రతిష్టాత్మాకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ నలుమూలలనుంచి దాదాపు 10లక్షలకు పైగా భక్తులు తరలివస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ప్రాముఖ్యమైన 29న పూర్వరాధన, 30న మద్యారాధన, 31న ఉత్తరాధనలో భాగంగా మహరథోత్సవం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ రమాదేవి, డిప్యూటి ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి, డాక్టర్‌ సురేష్‌, ట్రాన్సకో ఏఈ గోవిందు, జయరామిరెడ్డి, ఆర్టీసీ డీఎం మద్దిలేటినాయుడు, సీఐ దస్తగిరి బాబు, ఎస్‌ఐలు మల్లికార్జున, విజయకుమార్‌, అగ్నిమాపక అధికారి రామాంజినేయులు, మలేరియా ఇనచార్జి కృపానంద్‌, సీఆర్‌వోలు విజయేంద్ర ఆచార్‌, బద్రినాథ్‌, అనంతపురాణిక్‌, రాఘవేంద్ర రావు, హరినాథ్‌, జేపీ స్వామి, జయతీర్థ ఆచార్‌,సెక్యూరిటి ఇనచార్జి రమేష్‌, మోహనరావు కులకర్ణి, రవి, రంగస్వామి, హరి అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

కర్ణాటక సీఎంకు ఆహ్వానం

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 355వ సప్తరాత్రోత్సవాలకు రావాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్దరామయ్యకు శ్రీమఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంగళవారం బెంగుళూరులో వేర్వేరు సమయాల్లో ఆయన కలిశారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఇచ్చిన జ్ఞాపిక, శేషవస్త్రం, పరిమళ ప్రసాదం ఇచ్చారు. అనంతరం పీఠాధిపతితో ఫోనలో మాట్లాడారు. ఉత్సవాల కంటే ముందే మంత్రాలయానికి వస్తానని సీఎం డీకే శివకుమార్‌ చెప్పినట్లు తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 11:24 PM