రాధాగాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్ అరెస్టు
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:16 AM
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త సోమయాజుల శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు..
విశాఖపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త సోమయాజుల శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న శ్రీచరణ్, రాధాగాయత్రి గత నెల 14న విహారయాత్రకు వెళ్లారు. ముస్సోరి సమీపాన కియానా హోమ్‌స్టేలో రాత్రి బస చేశారు. తెల్లవారేసరికి ఆమె చనిపోయి ఉంది. దీనిపై ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సరస్వతి.. విశాఖలో, డెహ్రాడూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని శనివారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న డెహ్రాడూన్ పోలీసులు.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.