నేడు క్వాంటమ్-ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:07 AM
ప్రతిష్ఠాత్మక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా క్వాంటమ్-ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ (ఏక్యూఏఐసీ) గురువారం ప్రారంభం కానుంది.
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా క్వాంటమ్-ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ (ఏక్యూఏఐసీ) గురువారం ప్రారంభం కానుంది. ఐబీఎం సహకారంతో ఏర్పాటవుతున్న ఈ సెంటర్... అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, స్టార్టప్ కంపెనీలు, వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్, 3000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థులకు క్వాంటమ్ అప్లికేషన్లు, అల్గారిథమ్స్ అభివృద్ధిపై ఈ సెంటర్‌లో శిక్షణ ఇస్తారు. పలు రంగాల్లో క్వాంటమ్ అప్లికేషన్ల అభివృద్ధికి ఈ సెంటర్ సహకారం అందిస్తుంది.