నాణ్యమైన శిక్షణతోనే యువతకు ఉపాధి: దీపక్‌రెడ్డి
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:30 AM
నాణ్యమైన శిక్షణ ద్వారానే యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (సీడాప్) చైర్మన్ దీపక్‌రెడ్డి అన్నారు.
నాణ్యమైన శిక్షణ ద్వారానే యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (సీడాప్) చైర్మన్ దీపక్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలో డీడీయూ-జీకేవై 1.0, 2.0 కార్యక్రమాలపై బుధవారం వర్క్‌షాపు ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాలను సేవా దృక్పథంతో నిర్వహించాలన్నారు. నియామకాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలు అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఈఓ నారాయణస్వామి ప్రసంగించారు.