గురుకులాల్లో నాణ్యమైన విద్య
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:13 AM
ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కంబాలపాడులో పూలే (బీసీ) బాలుర గురుకుల
పాఠశాల ప్రారంభం
క్రిష్ణగిరి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం కంబాలపాడు గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే (బీసీ) బాలుర గురుకుల పాఠశాలను ఎంపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశ పెట్టిందన్నారు. మెగా డిఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. దాంతో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందుతోందన్నారు. అనంతరం క్రిష్ణగిరి జిల్లా పరిషత పాఠశాలను ఎంపీ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులకు రూ. పదివేల నగదును అందిస్తానన్నారు. కార్యక్రమంలో క్రిష్ణగిరి సింగిల్ విండో చైర్మన కేఈ శేషాద్రి, పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన నభి సాహేబ్, టీడీపీ మండల అధ్యక్షడు దామోదర్ నాయుడు, మర్రి శ్రీరాములు, ఎల్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.