Share News

వాణిజ్య ఒప్పందంతో 25 కోట్ల మందికి లబ్ధి

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:36 AM

వాణిజ్య ఒప్పందంతో దేశంలో 25కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు.

వాణిజ్య ఒప్పందంతో 25 కోట్ల మందికి లబ్ధి

  • ఆక్వా రంగానికి కొత్త మార్కెట్లకు అవకాశం: పీవీఎన్‌ మాధవ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వాణిజ్య ఒప్పందంతో దేశంలో 25కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులు ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లు వెతుక్కోవడానికి అవకాశం కలిగిందన్నారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, దాని ఫలితంగానే ట్రంప్‌ సుంకాలను 18 శాతానికి తగ్గించారన్నారు. ఎగుమతిదారులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. అరుదైన ఖనిజాలను వెలికి తీసేందుకు నిధులు కేటాయించారని, దీనివల్ల రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించారన్నారు. జీడిమామిడి, కోకో పండించే రైతులకు ఈ బడ్జెట్‌తో లబ్ధి కలుగుతుందన్నారు. అరకు-పాడేరు మధ్య ఏర్పాటుచేసే ట్రెక్కింగ్‌ ట్రాక్‌ వల్ల పర్యాటకం పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందన్నారు. 2047 వరకు పన్నుల మినహాయింపు ఇవ్వడం వల్ల ఏపీలో పెద్దసంఖ్యలో డేటాసెంటర్లు ఏర్పాటవుతాయన్నారు. సీప్లేన్లు అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి శ్రీశైలానికి 45నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అది వారి దిగుజారుడుతనానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 05:37 AM