Share News

1 నుంచి రైల్వే జోన్‌ కార్యకలాపాలు: మాధవ్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:20 AM

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ శనివారం...

1 నుంచి రైల్వే జోన్‌ కార్యకలాపాలు: మాధవ్‌

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయం వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్‌ ద్వారా 15 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి’ అని మాధవ్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 04:20 AM