Share News

‘డ్రగ్స్‌పై దండయాత్ర’ అభినందనీయం

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:33 AM

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌ నుంచి ఐదుగురు మహిళా పోలీసులు సైకిల్‌ యాత్ర చేయడం అభినందనీయమని...

‘డ్రగ్స్‌పై దండయాత్ర’ అభినందనీయం

  • విజయవాడ పోలీసులపై పీవీ సింధు ప్రశంసలు

విజయవాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌ నుంచి ఐదుగురు మహిళా పోలీసులు సైకిల్‌ యాత్ర చేయడం అభినందనీయమని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసించారు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఎస్‌ఐ కడలి రేవతి, హెచ్‌సీ గుమ్మడి హైమావతి, కానిస్టేబుళ్లు చీపు త్రివేణి, షేక్‌ బీబీ శైలజ, వాయిబోయిన ఉషారాణి ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 510కి.మీ. సైకిల్‌ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అడ్మిన్‌ డీసీపీ కేజీవీ సరిత, ఏడీసీపీ మురళీకృష్ణ, సెంట్రల్‌ ఏసీపీ దామోదరరావు సింధుకు వివరించారు.

Updated Date - Feb 17 , 2026 | 04:34 AM