Share News

AP Govt: ఏపీ జెన్కో ఇన్‌చార్జి ఎండీగా పుల్లారెడ్డి

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:11 AM

ఏపీ జెన్కో ఇన్‌చార్జి ఎండీగా ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీగా ఉన్న పొగాకు పుల్లారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt: ఏపీ జెన్కో ఇన్‌చార్జి ఎండీగా పుల్లారెడ్డి

అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో ఇన్‌చార్జి ఎండీగా ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీగా ఉన్న పొగాకు పుల్లారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎండీగా ఉన్న ఎస్‌.నాగలక్ష్మి జూలై 17 వరకు ప్రసూతి సెలవుపై వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు పుల్లారెడ్డిని ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జెన్కోతోపాటు ఏపీ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కి, ఏపీస్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌కు కూడా పుల్లారెడ్డి ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరిస్తారు.

Updated Date - Jan 19 , 2026 | 04:11 AM