Share News

Electricity Charges: 20న విద్యుత్తు చార్జీలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:42 AM

విద్యుత్తు చార్జీల టారిఫ్‌పై ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూల్‌ను...

Electricity Charges: 20న విద్యుత్తు చార్జీలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చార్జీల టారిఫ్‌పై ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూల్‌ను సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 2026-27వ ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీఈఆర్సీ చైర్మన్‌ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించనున్నట్లు తెలిపారు. 20న తిరుపతిలో, 22, 23న విజయవాడలో, 27న కర్నూలులో ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని వివరించారు.

Updated Date - Jan 14 , 2026 | 04:43 AM