Share News

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:14 AM

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమల చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం
పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి

రెండేళ్లలో సమాన స్థాయిలో

అభివృద్ధి, సంక్షేమం

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమల చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, పార్టీ పరిశీలకులు మునిశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎంబీ చర్చిలో ప్రత్యేకప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం వార్డులో ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు, తల్లికి వందనం, ఎన్టీఆర్‌ భరోసా, దీపం పథకం, స్ర్తీశక్తి, అన్నదాత సుఖీభవ, ఉపాధి కల్పన కోసం జాబ్‌ మేళలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. వార్డులో జరుగుతున్న సీసీరోడ్లు, ప్రహరి, డ్రైనేజీ నిర్మాణాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి సంక్షేమ పథకం అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన స్టేట్‌ డైరెక్టర్‌ పోతురాజు రవికుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంబీ మహేష్‌, స్థాని క నాయకులు సుందరరాజు, కదిరికోట అనిల్‌ కుమార్‌, షాలేమ్‌, ఉసేని, కటారి రాజేంద్ర, అబ్దుల్‌లు పాల్గొన్నారు.

వైసీపీ రాక్షసత్వానికి పరాకాష్ట

బాధితులకు అండగా ఉండాల్సింది పో యి నిందితులకు బాసటగా నిలవటం వైసీపీ రాక్షసత్వానికి పరాకాష్ట అని ఎ మ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. పట్టణంలోని 8వ వార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం నెమలకల్లులో ఓ దళిత మహిళలను ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులు కులం పేరుతో దూ షించి దాడిచేసి ఆమె భర్తను బెదిరించటం దారుణమన్నారు. దాడిలో గాయపడిన బాధితులకు అండగా ఉండాల్సిన ఎమ్మె ల్యే.. నిందితులను కాపాడేందుకు ధర్నాలు చేయటం వైసీపీకే చెల్లిందన్నారు. దళితుల హక్కుల గురించి మాట్లాడే వైసీపీ నాయకులు ఈ కేసులో విచారణ కోరకుండా నిందితుడికి మద్దతుగా రోడ్డెక్కడంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజాకోర్డులో చట్టపరంగా తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు మునిశేఖర్‌ రెడ్డి, కుర్ణి కార్పొరేషన చైర్మన మిన్నప్ప, ఎస్సీ కార్పొరేషన డైరెక్టర్‌రవికుమార్‌, నాయకులు ఎంబీ మహేష్‌, వాల్మీకి రామకృష్ణ నాయుడు, కటారి రాజేంద్ర, షాలేమ్‌, కదిరికోట అనిల్‌ కుమార్‌, సూరి పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:14 AM