Share News

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:17 AM

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలకు ఆటంకం లేకుండా సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

  • సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలకు ఆటంకం లేకుండా సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన పీఎస్ఆర్‌.. వైసీపీ ప్రభుత్వంలో పరిధి దాటి చేసిన వ్యవహారాలతో రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయనపై ఉన్న ఆరోపణలు తేలకపోతే పదవీ విరమణకు ముందురోజు నామమాత్రపు పోస్టింగ్‌ ఇచ్చి ప్రభుత్వం మరుసటి రోజు రిటైర్మెంట్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ నెలాఖరులోపు ఆయనపై ఉన్న క్రమశిక్షణ విచారణలు ముగియబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వీసులో ఉండగా మొదలైన విచారణలను సంబంధిత ఆలిండియా సర్వీసె్‌స-ఏఐఎస్‌ రూల్స్‌(డిసిప్లీన్‌ అండ్‌ అప్పీల్‌)-1969 ప్రకారం చేపట్టాలని ఆదేశించింది. ఆయనకు లభించే పెన్షన్‌ ప్రయోజనాలను ఏఐఎస్‌ రూల్స్‌-1958లోని 16 ప్రకారం కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయించనున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం చీఫ్‌గా పనిచేసిన పీఎస్ఆర్‌ను.. ముంబై నటికాదంబరి జెత్వానీపై వేధింపుల ఆరోపణలతో సస్పెండ్‌ చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా గ్రూప్‌-1 పేపర్ల మూల్యాంకనంలోనూ పీఎ్‌సఆర్‌ అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు వాస్తవమేనంటూ ఇటీవల కోర్టుకు సమర్పించిన నివేదికలో సీఐడీ పేర్కొంది. దీంతో ఆయనకు ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా పదవీ విరమణ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Updated Date - Aug 26 , 2026 | 06:23 AM