Sriharikota: 12న నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ62
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:56 AM
బాహుబలి రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన భారీ ఉగప్రహం బ్లూబర్డ్ ప్రయోగంతో గతేడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాది ఆరంభంలోనే...
సూళ్లూరుపేట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): బాహుబలి రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన భారీ ఉగప్రహం బ్లూబర్డ్ ప్రయోగంతో గతేడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాది ఆరంభంలోనే మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది..! తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఈ నెల 12న పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-ఎన్1ను కక్ష్యలోకి పంపనున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్దనున్న పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ భవనం (పిఫ్) వద్ద రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేసి లాంచ్‌ప్యాడ్ దగ్గరున్న ఎంఎ్‌సటీ టవర్ వద్దకు చేర్చారు. ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు దీన్ని ప్రయోగించే అవకాశం ఉంది. మొదట 10న ప్రయోగించాలని భావించినా, సాంకేతిక కారణాలతో 12కు వాయిదా పడింది. ఈ రాకెట్ నాలుగో దశలో స్పెయిన్ చెందిన స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడైమ్ భాగస్వామ్యంతో నిర్మించిన 25కిలోల కెస్ర్టెల్ ఇనీషియల్ డెమాన్‌స్ట్రేటర్ (కేఐడీ) క్యాప్సూల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. దీంతోపాటు మరో 18 రకాల పేలోడ్స్‌ను కూడా ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నట్లు ఇస్రో వర్గాల సమాచారం.