ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:08 AM
జిల్లాలో రవాణా శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిం చాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
వీసీలో కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రవాణా శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిం చాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో రవాణా శాఖ ప్రజలకు అందించే సేవలపై డీటీసీ, ఆర్డీఓలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గతంలో పాత పద్ధతి ప్రకారం వాహన రిజిసే్త్రషన్లు ఏజెంట్ల ద్వారా చేయించి వాహనదారుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయరాదన్నారు. జిల్లాలో వివిధ వాహనాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆనలైన ప్రక్రియ ద్వారా జర గాలన్నారు. రవాణా శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలపై ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలుస్తోందన్నారు.