Share News

గుక్కెడు తాగునీరు అందించండి

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:06 AM

ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. దాదాపు నెలరోజులుగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నాం... పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్దికెర లోని సాయినగర్‌ కాలనీవాసులు, మహిళ లు సోమవారం పంచాయతీ కార్యాలయా న్ని ముట్టడించారు.

 గుక్కెడు తాగునీరు అందించండి
అధికారుల చుట్టుముట్టిన ప్రజలు

పంచాయతీ ముందు

గ్రామస్థుల ఆందోళన

అధికారుల నిలదీత

మద్దికెర, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. దాదాపు నెలరోజులుగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నాం... పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్దికెర లోని సాయినగర్‌ కాలనీవాసులు, మహిళ లు సోమవారం పంచాయతీ కార్యాలయా న్ని ముట్టడించారు. దాదాపు రెండు గం టల పాటు ఆందోళనలు చేశారు. అధికారు లను చుట్టుముట్టారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సాయినగర్‌ కాలనీలో దాదాపు 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం జలజీవన కింద రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టి ఓవర్‌ హెడ్‌ ట్యాంకు, ఇంటింటికి కొళాయిలు ఇచ్చారు. నాయకులు, అధికారుల సమన్వ య లోపం వల్ల దాదాపు పూర్తయి 6 నెలలు దాటినా ఇంతవరకు ప్రారంభించక పోవడంతో కాలనీలో నీటి కష్టాలు అధికమ య్యాయి. దాంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున పంచాయతీ కార్యాలయం చేరుకుని ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ గంటల తరబడి వేచి ఉన్నా రెండు బిందె ల నీరు కూడా రావడం లేదన్నారు. నెలకు రూ.100ల చొప్పున కొళాయికి పన్నులు కడుతున్నామనీ, నీరు అందించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మయాంక్‌, జడ్పీటీసీ సభ్యులు మురళీధర్‌ రెడ్డిని ప్రజలు చుట్టుముట్టారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారు.. ఇప్పుడు నీటి సమస్య పట్టించుకో రా అంటూ నిలదీశారు. తమ ప్రాంతంలో బోర్లు కూడా లేవని, గుక్కెడు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నామ న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Jul 07 , 2026 | 12:06 AM