Share News

మహిళలకు రక్షణ చట్టం

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:28 PM

రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం రక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని.. మహిళలకు చట్టప రంగా ఎన్నో హక్కులను ప్రభుత్వం కల్పించిందని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య అన్నారు.

మహిళలకు రక్షణ చట్టం
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకట్రామయ్య

డీఎస్పీ వెంకట్రామయ్య

‘మీ రక్షణ మా బాధ్యత’ అనే అంశంపై అవగాహన

మద్దికెర, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం రక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని.. మహిళలకు చట్టప రంగా ఎన్నో హక్కులను ప్రభుత్వం కల్పించిందని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య అన్నారు. మంగళవారం స్థానిక డీపీఏపీ కమ్యూనిటీ హాలులో ‘మహిళలపైౖ నేరాలు, అవగాహన కార్యక్రమం’ - ‘మీ రక్షణ మా బాధ్యత’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయన్నారు. వారికి సహాయం అందించడానికి హెల్ప్‌లైన ఏర్పాటు చేశామన్నారు. మహి ళలకు అన్యాయం జరిగితే పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. మహిళల్లో చైతన్యం రావాలంటే చదువుతోనే సాధ్యమవుతుందన్నారు. తమపై జరిగే దాడులను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ప్రతి మహిళ శక్తి యాప్‌ను తమ సెల్‌ఫోనలో డౌనలోడు చేసుకోవా లన్నారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ 112, 181, 1098, 1930లకు ఫోన చేస్తే పోలీసులు అందు బాటులో ఉంటారన్నారు. మహిళలమని అధైర్యపడకుండా ముందు కు సాగాలన్నారు. ప్రభుత్వం మహిళల కోసం పలు రక్షణ చట్టాలను అమలు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారిణి రాగిణి, సీఐ పులిశేఖర్‌ గౌడు, ఎస్‌ఐ హరిత, తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 11:28 PM