Share News

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల పదోన్నతులపై పంచాయితీ తెగేనా?స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల పదోన్నతులపై పంచాయితీ తెగేనా?

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:28 AM

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుంది? బుధవారం పవన్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్న నేపథ్యంలో వినిపిస్తున్న ప్రశ్న ఇది.

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల పదోన్నతులపై పంచాయితీ తెగేనా?స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల పదోన్నతులపై పంచాయితీ తెగేనా?

  • ఉద్యోగాలిచ్చి వదిలే సిన గత వైసీపీ ప్రభుత్వం

  • ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరిట గందరగోళం

  • నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుంది? బుధవారం పవన్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్న నేపథ్యంలో వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఈ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత జగన్‌ ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు ఇచ్చి వదిలేసింది. పదోన్నతులపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో పాటు వివిధ కేటగిరీల ఉద్యోగుల వేతనాలను ఇష్టానుసారంగా నిర్ణయించి అసమానతలు సృష్టించింది. ఆ తర్వాత కూటమి సర్కారు ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరిట కొత్త నిబంధనలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులకు పదోన్నతుల అంశంపై తీవ్ర గందరగోళం, ఆందోళన నెలకొన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఉపసంఘం ఏర్పాటు చేసి ఐదు నెలలు అవుతోంది. అనేక దఫాలుగా సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు కానీ, పలుమార్లు వాయిదా పడింది. కనీసం ఈసారైనా ఎడ తెగని పదోన్నతుల పంచాయితీపై చర్చించి, పరిష్కారం చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో లక్షకు పైనే ఉద్యోగులను నియమించిన సంగతి తెలిసిందే. నియామకాలు అయితే చేశారు కానీ.. భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వలేదు. పదోన్నతులు ఎవరికి, ఎలా ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి?అనే అంశాలపై నిర్దిష్ట విధివిధానాలు రూపొందించారు.

Updated Date - Mar 25 , 2026 | 04:30 AM