AP High Court Justice Krishnamohan: తెలుగుపై మక్కువ పెంచాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:15 AM
పిల్లలకు తెలుగు భాషపై మక్కువ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ పేర్కొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్
గుంటూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): పిల్లలకు తెలుగు భాషపై మక్కువ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడటం, రాయడం, చదవడం చేయాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడుతూ పిల్లలు ఏ సిలబస్ చదివినా ద్వితీయ భాషగా తెలుగు ఉండేలా చూడాలని సూచించారు. తెలుగు భాషపై మక్కువ పెంచుకునేలా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏ భాషలో చదువుకొన్నా ఉద్యోగావకాశాలు వస్తాయన్న నమ్మకాన్ని పెంపొందించగలగాలన్నారు. తెలుగు కోసం ఎన్నో సేవలు చేసిన మహనీయుల విగ్రహాలను అమరావతి లో ఏర్పాటు చేసి, వారి గురించి పిల్లలకు తెలియజేయాలన్నారు.