ఏపీహెచ్‌ఆర్‌డీఐ డీజీగా ధీరజ్ శర్మ
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:36 AM
ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవల్‌పమెంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా ప్రొఫెసర్ ధీరజ్ శర్మను ప్రభుత్వం నియమించింది.
అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవల్‌పమెంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా ప్రొఫెసర్ ధీరజ్ శర్మను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన రోహతక్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు సేవలందించే విధంగా ప్రభుత్వం ఆయనకు అవకాశం కల్పించింది.