వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి : ఏఎస్పీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:08 AM
సమాజంలో ఎదురయ్యే కొత్త సవాళ్లపై అవగాహన కలిగి ఉంటూ వృత్తి నైపుణాన్ని పెంపొందించుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన) ఎన.యుగంధర్‌బాబు ఆదేశించారు.
నంద్యాల క్రైం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఎదురయ్యే కొత్త సవాళ్లపై అవగాహన కలిగి ఉంటూ వృత్తి నైపుణాన్ని పెంపొందించుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన) ఎన.యుగంధర్‌బాబు ఆదేశించారు. తద్వారా విధుల్లో ఎదురయ్యే అవరోధాలను అధిగమించవచ్చన్నారు. జిల్లా సాయుధ బలగాలు (ఏఆర్) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో సోమవారం మొబిలైజేషన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బందికి ఒక రిఫ్రెష్‌మెంట్ కోర్సులా ఉపయోగపడుతుందని, శిక్షణ పొందిన అనంతరం మరింత సమర్థ మంతంగా విధులు నిర్వహించేందుకు దోహద పడుతుందన్నారు. ఆరోగ్యానికి సిబ్బంది అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మానసికంగా, ధృఢంగా ఉన్నప్పుడే విధులు చక్కగా నిర్వహించగలరన్నారు. ఇందులో భాగంగా సిబ్బందికి మెడికల్ క్యాంపులు, యోగా, ధ్యానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఫైరింగ్, మాబ్ కంట్రోల్, కవాతు, డ్రిల్, ప్రముఖులకు బందోబస్తు వంటి విధులను సమర్థంగా నిర్వహించేలా దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్సపెక్టర్ బాబు, ఆర్‌ఎస్‌లు మనోహర్, ఉమా మహేశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.