Share News

ఆర్జీయూకేటీ వీసీగా ఎంఎల్‌ఎన్‌ రావు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:43 AM

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్‌ మద్దాలి లక్ష్మీనారాయణరావు నియమితులయ్యారు.

ఆర్జీయూకేటీ వీసీగా ఎంఎల్‌ఎన్‌ రావు

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్‌ మద్దాలి లక్ష్మీనారాయణరావు నియమితులయ్యారు. ఆయన ఐఐటీ కాన్పూర్‌లో 22 ఏళ్లు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ గిరిధర్‌ మద్రాస్‌ నియమితులయ్యారు. ఆయన ఐఐటీ-హైదరాబాద్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ గడ్డం విజయ ప్రకాశ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ-ఢిల్లీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 05:43 AM