Share News

Walk Pilgrimage: షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు కాలినడకన బండ్లగణేష్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:56 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోపిన అభాండాలు, కుట్రపూరిత కేసులు తొలగిపోతే కాలి నడకన తిరుమలకు వచ్చి స్వామివారిని...

Walk Pilgrimage: షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు కాలినడకన బండ్లగణేష్‌

  • చంద్రబాబుపై అభాండాలు తొలగిపోయినందుకు మొక్కుతీర్చుకోనున్న నిర్మాత

షాద్‌నగర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోపిన అభాండాలు, కుట్రపూరిత కేసులు తొలగిపోతే కాలి నడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌... తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 9గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణ శివారులోని జానంపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తిరుమలకు కాలినడకన బయల్దేరుతారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటినీ కూడా అత్యున్నత న్యాయస్థానాలు కొట్టివేయడంతో తన మొక్కును చెల్లించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్‌ వివరించారు.

Updated Date - Jan 19 , 2026 | 04:56 AM