Share News

లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

ABN , Publish Date - May 25 , 2026 | 05:07 AM

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

  • ఆరుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు

కోదాడ, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాకినాడ నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ వెళ్తున్న ఓలా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కోదాడ వద్ద విజయవాడ- హైదరాబాద్‌ జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్‌ తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 05:08 AM