Share News

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:07 AM

పేదల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
పింఛన్లను పంపిణీ చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ

ఆదోని, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. సోమవారం ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. బలహీనవర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెస్త ఓంకార్‌, మాజీ ఎంపీపీ మురళి, సాదిక్‌వలి, చిన్నస్వామి, వెంకటేష్‌, దస్తగిరి, నరసప్ప, తిక్కస్వామి, ఆంజనేయులు, అశోక్‌, అంజి, ఖాసీం, రాజు, బాబురావు, కుప్పగల్‌ హనుమంతు, దేవేంద్ర పాల్గొన్నారు. అలాగే ఆరేకల్‌ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి టీడీపీ నాయకుడు ఉమాపతినాయుడు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రంగస్వామినాయుడు, హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ రామకృష్ణ, రంగన్న, జిందే శంకర మండల అధ్యక్షుడు శివప్ప, రంగన్న, లక్క్షన్న, భీమ, నాగరాజు, శీన తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆదోని నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఏపీ కురుబ, కురుమ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాన్వి దేవేంద్రప్ప ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

ఆలూరు: మండలంలోని అరికెర గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ శీనప్ప, సొసైటీ అధ్యక్షులు కురువ ఈరన్న, స్థానిక టీడీపీ నాయకులు బొగ్గుల రాముడు, బొగ్గుల ఈరన్న, దబ్బల గాది పాల్గొన్నారు.

పత్తికొండ: పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం పట్టణంలోని పాతపేట పెద్ద ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:07 AM