Education Department: విద్యా శాఖ ఉత్తర్వులపై పీఎస్‌హెచ్‌ఎం ఫోరం నిరసనలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:42 AM
మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల విధులపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులపై పీఎస్‌హెచ్‌ఎం ఫోరం నిరసనలు చేపట్టింది. ఉత్తర్వుల కాపీలను....
అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల విధులపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులపై పీఎస్‌హెచ్‌ఎం ఫోరం నిరసనలు చేపట్టింది. ఉత్తర్వుల కాపీలను రాష్ట్రంలోని పలుచోట్ల భోగి మంటల్లో వేసి హెచ్‌ఎంలు నిరసన తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై విద్యాశాఖ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ తెలిపారు. పీఎ్‌సహెచ్‌ఎంలను పరిపాలనా విధులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. ఈ మేరకు పూర్తిస్థాయి జాబ్ చార్ట్ విడుదల చేయాలన్నారు. కాగా ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణల్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలు సాధారణ టీచర్ల తరహా విధులు నిర్వర్తించాలని, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు పరిపాలనా బాధ్యతలు తీసుకుంటారని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.