భూసేకరణ చట్టం ప్రిసైడింగ్ అధికారుల నియామకం
ABN , Publish Date - May 05 , 2026 | 05:18 AM
ఆంధ్రప్రదేశ్ భూసేకర ణ, పునరావాసం, పునస్థాపన చట్టం-2013 (భూసేకరణ చట్టం) అమలు కోసం విశాఖపట్నం, విజయవాడ రీజియన్‌లకు ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ...
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ భూసేకర ణ, పునరావాసం, పునస్థాపన చట్టం-2013 (భూసేకరణ చట్టం) అమలు కోసం విశాఖపట్నం, విజయవాడ రీజియన్‌లకు ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రీజియన్‌కు ప్రిసైడింగ్ అధికారిగా రిటైర్డ్ జిల్లా జడ్జి పి.భాస్కరరావు, విజయవాడ రీజియన్‌కు రిటైర్డ్ జిల్లా జడ్జి టి.వెంకటేశ్వర్లును నియమిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీఓ 652) జారీ చేశారు. విశాఖ రీజియన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు ఉంటాయి. విజయవాడ రీజియన్‌లో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. తిరుపతి రీజియన్‌లో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎ్‌సఆర్ కడప జిల్లాలు ఉంటాయి.