తాలాడలో నీలమ్మతల్లికి పూజలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:28 AM
మండలంలోని తాలాడ, ఘనసర గ్రామాల్లో కనుమ పురస్కరించుకుని గ్రామదేవతలకు మొక్కులు చెల్లించారు.
భామిని, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాలాడ, ఘనసర గ్రామాల్లో కనుమ పురస్కరించుకుని గ్రామదేవతలకు మొక్కులు చెల్లించారు. మేళతాలాలతో ఊరేగించిఅమ్మవారి ఆలయానికి వెళ్లి తాలాడలో నీలమ్మతల్లికి పూజలు నిర్వహించారు. సంక్రాంతి పురస్కరించుకుని వివిద ప్రాంతాల్లో స్ధిర పడిన వారంతా వచ్చికుటుంబసభ్యులతో అమ్మవారికి పూజలు చేశారు.