Share News

రాముడి మంత్రం రావణ మంత్రం!

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:07 AM

‘హే రామ్‌... సేవ్‌ ఏపీ’ అని ఇటీవల వైఎస్‌ జగన్‌ శ్రీరాముడిని తలచుకున్నారు! కానీ... అదే శ్రీరాముడితోపాటు హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని అసభ్యకరంగా తూలనాడుతూ అవమానించిన ప్రశ్న రావణ్‌కు జగన్‌ రక్షగా నిలిచారు.

రాముడి  మంత్రం రావణ మంత్రం!

  • ‘ప్రశ్న’ జోసెఫ్‌కు వైసీపీ అండదండలు

  • కోర్టులో పొన్నవోలు టీమ్‌ హాజరు..

  • రావణ్‌ సన్నిహితురాలికి జగన్‌ బ్లెస్సింగ్స్‌

  • గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద కలిసి భరోసా

  • ఆమెను విచారణకు పిలిచే యోచనలో పోలీసులు

  • వైసీపీ ఓడిపోయాక మరింతగా ‘గరళం’

  • హిందూ మతం, సనాతన ధర్మంపై విషం

  • పవన్‌ కల్యాణ్‌పై తీవ్రమైన దూషణలు

  • రావణ్‌ తమకు తెలుసన్న అంబటి రాంబాబు

  • రాష్ట్రంలో కాష్టం రగిల్చేందుకు ఉమ్మడి వ్యూహం!?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘హే రామ్‌... సేవ్‌ ఏపీ’ అని ఇటీవల వైఎస్‌ జగన్‌ శ్రీరాముడిని తలచుకున్నారు! కానీ... అదే శ్రీరాముడితోపాటు హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని అసభ్యకరంగా తూలనాడుతూ అవమానించిన ప్రశ్న రావణ్‌కు జగన్‌ రక్షగా నిలిచారు. ఇది వైసీపీ మార్కు తంత్రం! ‘రావణ్‌’తో కలిసి రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య ‘కాష్టం’ మండించే కుతంత్రం! బచ్చలకూరి జోసెఫ్‌... ‘ప్రశ్న’ అనే యూట్యూబ్‌ చానల్‌ నడుపుతూ ‘ప్రశ్న’ రావణ్‌గా మారిన సంగతి తెలిసిందే. తన చానల్‌తోపాటు బహిరంగ వేదికపై నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు క్రమంలో... రావణ్‌ మరో అవతారం బయటపడింది. అదే... హిందూ ద్వేషం! తన యూట్యూబ్‌ చానల్‌లో హిందూ మతాన్ని, దేవుళ్లను దారుణంగా కించపరిచే వీడియోలు పుంఖానుపుంఖాలు చేశాడు. దీంతో పోలీసులు ‘ఉపా’ చట్టం కింద రా వణ్‌ను అరెస్టు చేశారు. ఇన్నాళ్లు ‘రావణ్‌’తో అంతర్గ త బంధం నడుపుతున్న వైసీపీ ఇప్పుడు నేరుగా తె రపైకి వచ్చేసింది. వైసీపీ నేతలు రావణ్‌ను సమర్థి స్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక... శుక్రవారం నేరు గా జగన్‌ ‘లాయర్ల టీమ్‌’ రంగంలోకి దిగింది. గన్నవరం కోర్టులో రావణ్‌ తరఫున వైసీపీ ఇంటి లాయ ర్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వకాల్తా పుచ్చుకున్నారు.


జోసెఫ్‌ సన్నిహితురాలికి జగన్‌ భరోసా

జోసె్‌ఫకు ‘ప్రశ్న’తోపాటు ‘గళం’ అనే మరో యూ ట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. గమన అనే మహిళతో కలిసి పలురకాల వీడియోలు తీశాడు. తన విమర్శకులు, ప్రత్యర్థులపై వ్యంగ్యంగా దాడి చేయడం... ‘ఆత్మనిర్భర భారత్‌’ వంటి విధానాలను గేలిచే యడం, ఇంకా రకరకాల కాన్సెప్టులతో కూడిన షార్ట్‌ వీడియోలవి! రావణ్‌పై ‘ఉపా’ కేసు పెట్టినప్పుడు... జగన్‌ను కలిసేందుకు ఇటీవల గన్నవరం విమానాశ్రయానికి గమన వచ్చింది. జగన్‌ లోపలికి వెళ్లేముందు ఆ పార్టీ నేత మల్లాది విష్ణు ఏదో చెప్పగానే... జగన్‌ ఆగి బారికేడ్‌కు ఆవల ఉన్న గమన వద్దకు వచ్చారు. తలపై చెయ్యి పెట్టి తనదైన శైలిలో ఆశీర్వదించారు. అక్కడే దేవినేని అవినాశ్‌ కూడా ఉన్నారు. ‘మరేం ఫర్లేదు... అవినాశ్‌ చూసుకుంటా డు’ అని గమనకు జగన్‌ భరోసా ఇచ్చి వెళ్లారు.

రౌండ్‌ టేబుల్‌లో రాజకీయం

‘ప్రశ్న’ రావణ్‌కు మద్దతుగా శుక్రవారం విజయవాడలో ఒక రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో వైసీపీ తరఫున అంబటి రాంబాబు పాల్గొన్నారు. ‘ప్రశ్నిస్తే ఉపా కేసు పెడతారా?’ అనేదే ఈ సదస్సులో పాల్గొన్న వారి ప్రధాన ఆక్రోశం! అసలు విషయం ఏమిటంటే... పవన్‌ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఏ ఒక్కదానిలోనూ రావణ్‌కు కోర్టులు రిమాండ్‌ విధించలేదు. బెయిల్‌ ఇచ్చి పంపించాయి. కానీ... ‘ఉపా’ కేసు నమోదైంది పవన్‌పై వ్యాఖ్యలు చేసినందుకో, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకో కాదు! హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని నీచాతి నీచం గా దూషించడం... తద్వారా సమాజంలో విద్వేషాలు రగిల్చే కుట్రలకు పాల్పడటం! అందుకే ‘ఉపా’ కేసు నమోదైంది. జోసెఫ్‌ రావణ్‌కు కోర్టు రిమాండు విధించింది. ఈ మాత్రం తెలుసుకోకుండా ‘ప్రశ్నిస్తే ఉపా కేసు పెడతారా’ అని రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో నాయకులు, మేధావులు వాపోవడం విచిత్రం!


పవర్‌ పోగానే కుతంత్రాలు...

మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్ట డం... అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించడం... తద్వారా అధికారంలోకి రావడం! 2019 ముందు వైసీపీ పాటించిన వ్యూహం ఇదే! 2024లో అధికారం కోల్పోయాక అనుసరిస్తున్న వ్యూహమూ ఇదే! ఇందులో భాగంగానే ‘ప్రశ్న’ రావణ్‌నూ వాడుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకుముందు రావణ్‌ వీడియోల్లో ఇంత నీచత్వం కనిపించేది కాదు. కానీ... వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాతే ‘ప్రశ్న’ చానల్‌లో రాక్షసత్వం మొదలైంది. హిందూ మతాన్ని దారుణంగా దూషిస్తూ, పనిలోపనిగా పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడుతూ జోసెఫ్‌ రావణ్‌ అనేక వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టే మాటలూ మాట్లాడాడు. ఈ రావణ్‌ తమకు ముందు నుంచీ తెలుసని వైసీపీ నేత అంబటి రాంబాబు స్వయంగా ప్రకటించుకున్నారు. మొత్తానికి... వైసీపీ రాజకీయ వ్యూహం అమలులో జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ ఒక ఉపకరణమని ఇప్పుడు స్పష్టమవుతోంది.

వైసీపీ కులతంత్రాలు

ప్రశ్న రావణ్‌ విషయంలో ప్రజలను గందరగోళ పరిచేందుకు ఎప్పట్లాగే వైసీపీ కులతంత్రాలూ అమ లు చేసింది. ‘అతనిది కమ్మ కులం. టీడీపీ మనిషే. మద్దతు దారే’ అని ప్రచారం చేశారు. జోసెఫ్‌ది కమ్మ కులమని, అందుకే ఆయన ఎప్పుడూ చంద్రబాబును విమర్శించలేదని వైసీపీ నేత కొడాలి నాని కూడా చెప్పారు. కానీ... జోసెఫ్‌ దళితుడని పోలీసు లు నిర్ధారించారు. ఆయన తండ్రిపేరు డేనియల్‌. ఇక... జోసెఫ్‌ భార్య పేరు వెనుక ‘రెడ్డి’ అని ఉం టుంది. కానీ, ఆమె రెడ్డి కాదు. మరో కులం! ఇలా తమది కాని కులం పేర్లు తగిలించుకుని ‘కన్ఫ్యూజ్‌’ చేయడం గమనార్హం. జోసె్‌ఫకు భాగస్వామిగా ఉన్న ఆయన సన్నిహితురాలు గమనకు తెర వెనుక మంత్రాంగమంతా తెలుసునని పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశముంది.

Updated Date - Jul 11 , 2026 | 04:11 AM