Share News

రావణ్‌ కేసులో విచారణకు గమన, ఇంద్రసేన డుమ్మా

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:40 AM

యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ కేసులో గన్నవరం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావలసిన ‘ప్రశ్న’ చానల్‌ సీఈవో గమన, ఇంద్రసేన చౌదరి గైర్హాజరయ్యారు.

రావణ్‌ కేసులో విచారణకు గమన, ఇంద్రసేన డుమ్మా

  • పోలీసులు పదే పదే పిలుస్తున్నారని హైకోర్టుకు

విజయవాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ కేసులో గన్నవరం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావలసిన ‘ప్రశ్న’ చానల్‌ సీఈవో గమన, ఇంద్రసేన చౌదరి గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం జరిగిన విచారణ పూర్తయ్యాక పోలీసులు వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు. మంగళవారం మళ్లీ రావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు తీసుకుని వెళ్లిన తర్వాత వారిద్దరూ.. పోలీసులు విచారణ పేరుతో పదేపదే పిలుస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రావణ్‌ను అరెస్టు చేశాక పోలీసులు గమన, ఇంద్రసేనను మూడుసార్లు విచారణకు పిలిచారు.

Updated Date - Jul 22 , 2026 | 04:42 AM