ప్రశ్న రావణ్ అరెస్టు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:31 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేశారు.
మచిలీపట్నం నుంచి పాయకరావుపేట తీసుకొచ్చిన పోలీసులు
ఎలమంచిలి కోర్టులో హాజరు.. బెయిల్ మంజూరు
స్టేషన్ ఎదుట జనసేన నాయకులు, కార్యకర్తల ఆందోళన
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని శనివారం నక్కపల్లి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని రావణ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి వంటా వార్పు, భోజనాలు చేశారు. రావణ్‌ను కోర్టుకు తరలిస్తుండగా జన సైనికులు చెప్పులు చూపుతూ వెంబడించారు. ఎలమంచిలి కోర్టు రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైదరాబాద్‌కు వెళ్తున్న రావణ్‌ను వేంపాడు టోల్‌గేటు వద్ద ఏలూరు త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శనివారం జనసైనికులు రావణ్‌పై ఫిర్యాదు చేశారు.