Share News

ప్రసాద్‌ సూరికి అకాడమీ యువ పురస్కారం

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:24 AM

ప్రముఖ యువ రచయిత ప్రసాద్‌ సూరికి 2025 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ....

ప్రసాద్‌ సూరికి అకాడమీ యువ పురస్కారం

  • ‘మైరావణ’ నవలకు గాను అందించిన అకాడమీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ యువ రచయిత ప్రసాద్‌ సూరికి 2025 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందించారు. విశాఖకు చెందిన ప్రసాద్‌ సూరి మత్స్యకారుల జీవితంపై పరిశోధించి రచించిన ‘మైరావణ’ నవలకు ఈ పురస్కారం లభించింది. స్వయంగా మత్స్యకారుల కుటుంబానికి చెందిన ప్రసాద్‌ సూరి పురాణం, జానపద గాథలు, సమకాలీన సామాజిక సమస్యలను మేళవించి లోతైన దృక్పథంతో ఈ నవల రచించారని ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ కొనియాడింది. ఆర్టిస్ట్‌ మోహన్‌పై మోనోగ్రా్‌ఫతోపాటు ‘మై నేమ్‌ ఈజ్‌ చిరంజీవి’, ‘బాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’ అనే నవలలను కూడా ఆయన రచించారు. యువ పురస్కారంలో భాగంగా ప్రసాద్‌ సూరికి రూ. 50 వేల నగదు, తామ్ర పత్రం బహూకరించారు.

Updated Date - Apr 02 , 2026 | 04:24 AM