Tirumala: తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:29 AM
తిరుమలలో ఆదివారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది. ఏటా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజున, అధ్యయనోత్సవాల్లో 17వ రోజున ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమల, జనవరి 4(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది. ఏటా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజున, అధ్యయనోత్సవాల్లో 17వ రోజున ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. సాయంత్రం 4 గంటలకు మలయప్ప స్వామి పల్లకిపై పుష్కరిణి వద్దకు వచ్చారు. అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురు వచ్చారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరుపున జీయంగార్లు పూలచెండ్లను స్వామిపై మూడుసార్లు విసిరారు. స్వామి బెదిరినట్టుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడడంతో, అమ్మవార్లు శాంతించి స్వామికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు.