Share News

ప్రకృతి సాగు లాభదాయకం: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:43 AM

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని మంత్రి సవిత అన్నారు. ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని...

ప్రకృతి సాగు లాభదాయకం: మంత్రి సవిత

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని మంత్రి సవిత అన్నారు. ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు చెందిన రైతుల కోసం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఒక వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరో వైపు స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజ వనరులతో వ్యవసాయాన్ని కొనసాగిస్తే రైతులకు ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయి. సహజ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల నేల సారం కూడా పెరుగుతుంది. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. అధిక ధర లభిస్తోంది. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన రైతులు ప్రకృతి సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు సాధించాలి’ అని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. కార్యక్రమంలో ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌, కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చి రామ్‌ప్రసాద్‌, ఆయా కార్పొరేషన్ల ఎండీలు, రైతు సాధికర సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 06:43 AM