ఆప్టా అధ్యక్షుడిగా ప్రకాశ్‌రావు
ABN , Publish Date - May 31 , 2026 | 05:59 AM
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్షుడిగా కాకి ప్రకాశ్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్షుడిగా కాకి ప్రకాశ్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆప్టా రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు శనివారం విజయవాడలో జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా ఎంజీ మెహది, ఆర్థిక కార్యదర్శిగా సుంకరి నారాయణరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సాదరతుల్ల బేగ్, సహాధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాసరావు, అస్టాం, మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా బొక్కెన రాము, ఇస్మాయిల్, మహ్మద్ అలీ అక్బర్, మహమ్మద్ నజీర్, నారాయణ, కార్యదర్శులుగా గోపాలకృష్ణ, మహమ్మద్ ఖదీరుల్లా, నవీన్, లత, విజయలక్ష్మి ఎన్నికయ్యారు.