Share News

మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయింది

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:33 AM

మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి మన దేశ స్వతంత్రతకు నీళ్లొదిలిందని సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు.

మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయింది

  • ప్రకాశ్‌ కరత్‌

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి మన దేశ స్వతంత్రతకు నీళ్లొదిలిందని సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్వంలో శుక్రవారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఇరాన్‌పైదాడి-అమెరికా, ఇజ్రాయెల్‌ సామ్రాజ్యవాద దురహంకారం’ అనే అంశంపై కరత్‌ ప్రసంగించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను భారత ప్రభుత్వం ఖండించకపోవడం అన్యాయం, అభ్యంతరకరమన్నారు. అమెరికాకు సాగిలపడిన కేంద్ర వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Updated Date - Mar 28 , 2026 | 04:37 AM