Share News

కర్నూలులో అట్టహాసంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు ప్రారంభం

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:53 AM

ప్రజల పక్షాన నిలబడి చైతన్యం తెచ్చిన ఏకైక సంస్థ ప్రజా నాట్య మండలి అని, నాటి ఎమర్జెన్సీ కాలం నుంచి నేటి ఆధునిక ఎమర్జెన్సీ వరకు ప్రజలకు న్యాయం జరిగేందుకు..

కర్నూలులో అట్టహాసంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు ప్రారంభం

కర్నూలు కల్చరల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల పక్షాన నిలబడి చైతన్యం తెచ్చిన ఏకైక సంస్థ ప్రజా నాట్య మండలి అని, నాటి ఎమర్జెన్సీ కాలం నుంచి నేటి ఆధునిక ఎమర్జెన్సీ వరకు ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాటాలు చేస్తోందని ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అన్నారు. ప్రజా నాట్య మండలి (పీఎన్‌ఎం) 11వ రాష్ట్ర మహాసభలు కర్నూలులో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రానికి చెందిన మండలి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఫ్యాసిజానికి, ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పుట్టిందే ప్రజా నాట్య మండలి అని గుర్తు చేశారు. సమాజంలో మార్పు రావాలంటే అది ప్రజా చైతన్య కళల ద్వారానే సాధ్యమన్న్నారు. కర్నూలు నగరంలో కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గొరవయ్యలు, డప్పు కళాకారులు, గ్రామీణ కళాకారులు, కోలన్నల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం వీధి నాటకాలను ప్రదర్శించారు.

Updated Date - Jul 26 , 2026 | 04:53 AM