Share News

నీటి పొదుపును పాటించండి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:15 PM

రైతుల్లో అవగాహన పెంచి తక్కువ నీటితోనే పంటలను సాగు చేయించాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులను ఆదేశిం చారు.

   నీటి పొదుపును పాటించండి

కలెక్టర్‌ డా.సిరి

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రైతుల్లో అవగాహన పెంచి తక్కువ నీటితోనే పంటలను సాగు చేయించాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాల్లో జిల్లా ఆయిల్‌ సీడ్స్‌ మిషన, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహిం చారు. ఆమె మాట్లాడుతూ తక్కువ నీటితో సాగు చేసే పంటలు వేర ుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ వంటి వాటిపై రైతులను దృష్టి పెట్టించాలన్నారు. మామిడి తోటల్లో ఇంకుడు గుంతలను తవ్వాలన్నారు. రైతు సంఘాల సభ్యులను డిజిటల్‌ గ్రీన, మైస్టోన, ఓఎస్‌డీసీ ప్లాట్‌ ఫారాల్లో నమోదు చేయించేందుకు రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలనికృషి విజ్ఞాన అధికారులను ఆదేశిం చారు. ఎనఎల్‌హెచఎప్‌ కింద పంట సాగుకు అవసరమైన రుణా లను బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఏడీ ఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని గణనీయంగా పెంచాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, ఏడీ ఎం రామచంద్రరావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణా రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ రాఘవేంద్ర, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:15 PM