Share News

బిందు సేద్యం చేయండి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:57 PM

జిల్లాలోని వ్యవసాయ తోటలో రైతులు బిందు సేద్యంతో రకరకాల పంటలు సాగు చేసుకొని నీటిని ఆదా చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి చైతన్యలక్ష్మి, డాట్‌ కేంద్రం శాస్త్రవేత్త సుజాత అన్నారు.

 బిందు సేద్యం చేయండి

నీటిని ఆదా చేసుకోండి

ఉద్యాన శాఖ జిల్లా అధికారి చైతన్యలక్ష్మి

మద్దికెర, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వ్యవసాయ తోటలో రైతులు బిందు సేద్యంతో రకరకాల పంటలు సాగు చేసుకొని నీటిని ఆదా చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి చైతన్యలక్ష్మి, డాట్‌ కేంద్రం శాస్త్రవేత్త సుజాత అన్నారు. సోమవారం పెరవలి గ్రామంలో రైతులకు స్థానిక సచివాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మిరప పంటను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల వల్ల బెట్ట వాతావరణంలో ఉల్లి, ఇతర కూరగాయల పంటలను ఆశించే పచ్చదోమ, రసం పీల్చు పురుగుల నివారణకు రసాయన మందుల కంటే జీవసంబంధిత వంటి మిత్ర సిలీంధ్రాలను వాడాలన్నారు. ప్రస్తుతం వర్షాలు పడటంతో కూరగాయల పంటలకు పొటాషియం, నైట్రేట్‌ మందులు పిచికారి చేయాలని తెలిపారు. బిందుసేద్యం ద్వారా కూరగాయల పంటలను సాగు చేసుకుంటే బెట్ట పరిస్థితి తగ్గి దిగుబడి వస్తుందన్నారు. రాయితీ కింద స్పింకర్లు, డ్రిప్‌లు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో హెచవో వెంకటేశ, వ్యవసాయ శాఖ విస్తరణాధికారి రాజశేఖర్‌, టీడీపీ మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:57 PM