Share News

త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:22 AM

పొట్టి శ్రీరాములు విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుందని మంత్రి లోకేశ్‌ అన్నారు.

త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు

  • ఏపీ గౌరవం స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌: లోకేశ్‌

గుంటూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ‘అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తాననే యువగళం హామీని నిలబెట్టుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌ గౌరవం స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు. యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరుల సమస్యల గురించి చర్చించాం. కొన్ని పరిష్కరించాం. ఇంకొన్ని ఉన్నాయి. అవి కూడా పరిష్కరిస్తాం. రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులు దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. ఈ చరిత్రను భావితరాలకు అందించడం మన బాధ్యత. 2025 సెప్టెంబరు 3న విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. 194 రోజుల్లోనే విగ్రహం ఏర్పాటు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం, ట్రస్ట్‌, అధికారులు, సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు అందరినీ అభినందిస్తున్నాను. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌ను ఎప్పుడూ స్పీడ్‌ పెంచాలి అంటూ ఉంటాను. విగ్రహ ఏర్పాటు మాత్రం జెట్‌ స్పీడ్‌లో చేశారు. 12 నెలల్లో స్మృతి వనం, ఫొటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్‌, ఆడిటోరియం, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ల నిర్మాణం పూర్తి చేయాలి. మీతో ఎప్పుడు సమావేశం అయినా మొదట గుర్తొచ్చేది రోశయ్య తాత. ఆయన రాజకీయాల్లో ేస్టట్స్‌మ్యాన్‌. రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 06:23 AM