Share News

త్యాగ శిల్పం ప్రజలకు స్ఫూర్తి, ప్రేరణ: మాధవ్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:24 AM

అమరావతిలో త్యాగ శిల్పం ఏర్పాటు తెలుగు ప్రజలకు స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

త్యాగ శిల్పం ప్రజలకు స్ఫూర్తి, ప్రేరణ: మాధవ్‌

ఇంటర్నెట్ డెస్క్: అమరావతిలో త్యాగ శిల్పం ఏర్పాటు తెలుగు ప్రజలకు స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ‘త్యాగాల గడ్డ అమరావతి రాజధాని. 58 రోజులు దీక్ష చేసి అమరజీవి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ఇక్కడి రైతులు 1631 రోజులు దీక్ష చేసి అమరావతిని నిలబెట్టుకున్నారు. అమరావతిపై గత ప్రభుత్వం పన్నిన కుట్రను భగ్నం చేస్తూ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు’ అని చెప్పారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, రైతుల త్యాగంతో అమరావతి నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 06:25 AM