Return Home: వెళ్లాలని లేకున్నా.. వెళ్తున్నా..!
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:27 AM
తెలుగు వారికి పెద్ద పండుగైన సంక్రాంతికి సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారంతా.. తమ కుటుంబాలతో సరదాగా, ఆనందంగా గడిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు వారికి పెద్ద పండుగైన సంక్రాంతికి సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారంతా.. తమ కుటుంబాలతో సరదాగా, ఆనందంగా గడిపారు. మరచిపోలేని ఆ తియ్యని జ్ఞాపకాలను మూటకట్టుకున్నారు! ఇప్పుడు పండుగ అయిపోయింది!! ఊరిని విడిచి తిరిగి వెళ్లాలని లేకున్నా.. ఉద్యోగం, విద్య, వ్యాపార రీత్యా వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు. దీంతో ఆదివారం ఏలూరు జిల్లాలోని రోడ్లపై వాహనాల రద్దీ నెలకొంది. ఏలూరు రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. బస్టాండ్ల వద్ద కూడా ఇదే రద్దీ కన్పించింది. కలపర్రు టోల్‌గేట్ వద్ద వాహనాలు బారులు దీరాయి. రాత్రి ఎనిమిది గంటల వరకు 20,764 వాహనాలు టోల్‌గేట్ దాటి విజయవాడ వైపు పయనించాయి.
- ఏలూరు/ఏలూరు క్రైం-ఆంధ్రజ్యోతి