పోర్టులపై పొంతనలేని సమాధానమా?: తూమాటి
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:45 AM
పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే సభలో పొంతన లేని సమాధానం చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విమర్శించారు.
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే సభలో పొంతన లేని సమాధానం చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ గేటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతప్రభుత్వం చేసిన ఖర్చునే కూటమి ప్రభుత్వం చేసినట్లుగా చెబుతున్నారన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు రేపు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కల్తీ మాఫియా నడుస్తోందని, ఏ మున్సిపాలిటీలో చూసినా డయేరియా విజృంభిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తెలిపారు. సభలో ఎంఎ్‌సఎంఈలపై ప్రశ్న అడిగితే మంత్రి పొంతన లేని సమాధానం చెబుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ విమర్శించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘వైవీ సుబ్బారెడ్డి భార్య హిందువు అని, కూటమి నేతల భార్యలు గానీ, టీటీడీ చైర్మన్ భార్యగానీ ఆమెలా తిరుమల కోసం మాట్లాడగలరా?’ అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి భార్య పూజలెన్నో చేస్తారని ఎమ్మెల్సీ కల్పతారెడ్డి అన్నారు. బైబిల్ పట్టుకుంటేనే క్రిస్టియన్లు అయిపోయినట్లేనా మీరెప్పుడూ పట్టుకోలేదా? అని ప్రశ్నించారు.