Share News

ఆమె కల నెలవేరింది

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:24 AM

సీఎం చంద్రబాబు తెచ్చిన పీ4(పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్‌ పార్టనర్‌షిప్‌) పథకం ద్వారా ఓ పేదింటి మహిళ సొంత ఇంటి కల నెరవేరింది.

ఆమె కల నెలవేరింది

  • పీ-4 లబ్ధిదారుకు ఇంటి నిర్మాణం పూర్తి

  • రూ.9 లక్షలు వెచ్చించిన దాత పసుపులేటి రామారావు

నిడమర్రు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు తెచ్చిన పీ4(పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్‌ పార్టనర్‌షిప్‌) పథకం ద్వారా ఓ పేదింటి మహిళ సొంత ఇంటి కల నెరవేరింది. గత నెలలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడుకు విచ్చేసిన సీఎం చంద్రబాబు సమక్షంలో గ్రీన్‌ ఆసియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ పసుపులేటి వెంకట రామారావు మార్గదర్శి(దాత)గా అదే గ్రామానికి చెందిన బంగారు(పేద) కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబానికి చెందిన జలాది లక్ష్మి ఇంటి నిర్మాణం నిధులు లేక సగంలో ఆగిపోవడంతో రామారావు సు మారు రూ.9 లక్షలు వెచ్చించి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, దాత పసుపులేటితో కలిసి మంగళవారం ఆ ఇంటిని పరిశీలించారు. పీ-4 ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నిండాయంటూ ఎమ్మెల్యే అన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 06:24 AM