పాలిసెట్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 06 , 2026 | 12:19 AM
ఏపీ పాలిసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
జిల్లాలో 91.82 శాతంతో ఉత్తీర్ణత
ముగ్గురికి ఉత్తమ ర్యాంకులు
ఫ 93.40 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే హవా
నంద్యాల ఎడ్యుకేషన, మే 5 (ఆంధ్రజ్యోతి) : ఏపీ పాలిసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాలో 6,093 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 5,467 మంది ఉత్తీర్ణులై 91.82 శాతంతో ఫలితాన్ని సాధించారు. 4022 మంది బాలురు పరీక్షలు రాయగా 3,559 మంది ఉత్తీర్ణులై 89.09 శాతం ఫలితాన్ని సాధించారు. 2,071 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,908 మంది ఉత్తీర్ణులై 93.40 శాతం ఫలితాన్ని సాధించారు. మరోసారి ఫలితాల్లో బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటారు. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో యశస్వినీరెడ్డి 112 మార్కులతో 130వ ర్యాంకు, సాయిచేతన 118 మార్కులతో 286వ ర్యాంక్, 116 మార్కులతో 288వ ర్యాంక్ సాఽధించారు. వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ తెలిపారు.