Share News

44 కేంద్రాల్లో పోలింగ్‌ సమయం కుదింపుv

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:06 AM

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల కలెక్టర్ల విన్నపం మేరకు 44 కేంద్రాల్లో పోలింగ్‌ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కుదించింది.

44 కేంద్రాల్లో పోలింగ్‌ సమయం కుదింపుv

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల కలెక్టర్ల విన్నపం మేరకు 44 కేంద్రాల్లో పోలింగ్‌ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కుదించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ కుదింపు వర్తిస్తుంది. రిమోట్‌ ప్రాంతాల్లో ఉన్న ఈ 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5 గంటలకే పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.

ఈ మేరకు ఎస్‌ఈసీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అరకు వ్యాలీ 3, అనంతగిరి 4, ముంచింగిపుట్టు 7, పెదబయలు 6, హుకుంపేట 2, జీ మాడుగుల 4, చింతపల్లి 2, జీకే వీధి 7, పాడేరు 1, కొయ్యురు 8 పోలింగ్‌ కేంద్రాలకు పై సమయాలు వర్తిస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడి రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితుల్లో కూడా ఇదే సమయంలో పోలింగ్‌ జరుగుతుందని ఎస్‌ఈసీ సృష్టం చేసింది.

Updated Date - Oct 24 , 2026 | 06:06 AM