అధికారం కోసమే పాదయాత్రలు..: రాఘవులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:48 AM
రాజకీయ నాయకులు చేస్తున్న పాదయాత్రలు అధికారం కోసమే తప్ప తమ కోసం కాదనే విషయాన్ని గుర్తించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలకు సూచించారు.
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాజకీయ నాయకులు చేస్తున్న పాదయాత్రలు అధికారం కోసమే తప్ప తమ కోసం కాదనే విషయాన్ని గుర్తించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలకు సూచించారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో విలేకరుల తో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్, లోకేశ్ పాదయాత్రలు చేశారు. అవి ప్రజల కోసం కాదు. వీరంతా వారి పదవులను తప్ప మిగిలిన అన్నింటినీ పీపీపీ చేస్తున్నారు. ప్రైవేటీకరణ కంటే పీపీపీ విధానం అత్యంత ప్రమాదకరమైంది. ప్రధాని మోదీ చెప్పినట్టుగానే జగన్, చంద్రబాబు చేసుకుపోతున్నారు’ అని ఆరోపించారు.